Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజువ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన కేజీబీవీ విద్యార్థులు

వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన కేజీబీవీ విద్యార్థులు

  • గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 3: వ్యవసాయ పారిశ్రామిక సందర్శనలో భాగంగా గూడెంకొత్తవీధి కేజీబీవీ విద్యార్థులు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధనలు, ఆధునిక సాగు పద్ధతులు, పంటల సాగు విధానాలపై విద్యార్థులు ప్రాయోగిక అవగాహన పొందారు. పరిశోధనల ద్వారా రైతులకు కలుగుతున్న ప్రయోజనాలను సిబ్బంది వివరించారు. ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు పాల్గొనగా, పుస్తక జ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి అనుభవం కల్పించేందుకు ఇటువంటి సందర్శనలు దోహదపడతాయని కేజీబీవీ ప్రిన్సిపల్ గొర్లె లావణ్య సరస్వతి తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular