Homeతాజా సమాచారంపేదల ఆకలి తీర్చుతున్న రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థలు

పేదల ఆకలి తీర్చుతున్న రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థలు

పేదల ఆకలి తీర్చుతున్న రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థలు

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద పేద‌ల‌కు అన్నదానం

నిర్వాహకులను అభినందించిన ప్రజలు

ఎల్బీనగర్, పెన్ పవర్, అక్టోబర్ 4:

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, న‌వ‌దీప ఫౌండేష‌న్ సంస్థల‌ సంయుక్తాధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స కోసం వచ్చిన పేద రోగులకు, వారి కుటుంబ సభ్యులకు, అవసరమైన సుమారు 300 మందికి ఉచితంగా భోజనం పంపిణీ చేశారు. సేవా కార్యక్రమంలో పలువురు స్వచ్చందంగా వాలంటీర్లుగా పాల్గొని, స్వయంగా ఆహారం పంపిణీ చేశారు. సమాజంలో ఆకలితో బాధపడుతున్న వారికి అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పేద ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించనున్నట్లు వెల్లడించారు. ఆస్పత్రుల వద్ద చికిత్స కోసం నిరీక్షించే పేద రోగులు, వారి కుటుంబ సభ్యులకు ఈ అన్నదానం ఎంతో ఉపయోగకరంగా మారిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ‘రెడీ టూ సర్వ్’ ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు పెద్ది శంకర్ గౌడ్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనుకునే దాతలు, స్వచ్ఛంద సేవకులు తమను సంప్రదించాలని కోరారు. సమాజ సేవలో మరి కొంత మంది భాగస్వాములు కావడం వల్ల అవసరమైన వారికి మరింత విస్తృతంగా సహాయం అందించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, నిర్వాహకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular