బాపట్ల, అక్టోబరు 5 : బాపట్ల మండలం వెదుళ్లపల్లి గ్రామంలోని రామనాయుడు కల్యాణ మండపంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నూతన గ్రామ అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెదుళ్లపల్లి గ్రామ టీడీపీ నూతన అధ్యక్షుడిగా బండారు వెంకటేశ్వర్లుతో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో బాపట్ల మార్కెట్ యార్డు చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

