Homeఆంధ్రప్రదేశ్బాపట్లదేశాయిపేట సర్పంచి అభ్యర్థిగా మార్పు నళిని

దేశాయిపేట సర్పంచి అభ్యర్థిగా మార్పు నళిని

టీడీపీ అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆమోదం

చీరాల, నవంబరు 11 :

దేశాయిపేట గ్రామ సర్పంచి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున మార్పు దావీదు సతీమణి మార్పు నళినిని ఖరారు చేస్తూ చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య నిర్ణయం తీసుకున్నారు. ఆమె అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే ఆమోదం తెలిపారు.

ఈ సందర్భంగా మార్పు నళిని మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి అవసరాలను తెలుసుకుని సంబంధిత అధికారుల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ దేశాయిపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తనకు సర్పంచి అభ్యర్థిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రానున్న ఎన్నికల్లో గ్రామ ప్రజలు తనకు మద్దతుగా నిలిచి, ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వ సహకారంతో దేశాయిపేట గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేస్తానని మార్పు నళిని వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular