వేటపాలెం, అక్టోబరు 6: వేటపాలెం నుంచి రావూరు రోడ్డు మీదుగా పందిళ్లపల్లి కనెక్టింగ్ రోడ్డు వరకు రూ.1.74 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించి ప్రజల రాకపోకలను సులభతరం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రోడ్డు పూర్తయితే గ్రామాల ప్రజలు, విద్యార్థులు, రైతులు, వాహనదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

