Homeతెలంగాణఘనంగా పితృ మహాలయ అమావాస్య వేడుకలు

ఘనంగా పితృ మహాలయ అమావాస్య వేడుకలు

 

గార్ల, పెన్ పవర్, అక్టోబర్: 10

మహాలయ అమావాస్య పెత్ర మాసను పురస్కరించుకొని గార్ల మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో శనివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ పితృ మాతృదేవతల పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి పితృ దేవతల పేరు మీద ఐదు రకాల పదార్థాలను అర్చకులకు దానం చేశారు అనంతరం ఈ సందర్భంగా అర్చకులు అచ్యుత్ ఆచార్య మాట్లాడుతూ భాద్రపద మాసములో వచ్చే కృష్ణ పక్షమున మహాలయ పక్షము ప్రారంభం అవుతుందని.ఈ మహాలయ పక్షములో అమావాస్యని మహాలయ అమావాస్య , సర్వపితృ అమావాస్యగా పిలుస్తారని. ఈ సర్వపితృ అమావాస్య నాడు పితృ దోషము ఉన్నవారు తమ పితృదేవతలకు శార్థ కర్మలు జరిపించాలని బ్రహ్మ పురాణం ప్రకారం ఈ మహాలయ పక్షము రోజులలో యమధర్మరాజు యమలోకములో ఉన్న ఆత్మలందరికి ఆహారం తీసుకునేందుకు స్వేచ్ఛ ఇస్తాడని. మరణించిన వారి పిల్లలు లేదా వారసులు ఈ మహాలయ పక్షములో తమ పితృదేవతలకు పిండ ప్రధానం చేసి పితృదేవతలకు ఇష్టమైన పదార్థాలను దానం చేయడం ద్వారా పుణ్యంతో పాటు పెద్దల ఆత్మలు సంతోషించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో దువ్వా రామచంద్రు దబ్బా వెంకన్న పల్లా నర్సయ్య రాము సతీష్ కత్తి సురేష్ ఎడవల్లి ఉపేందర్ రడం వెంకన్న యాకమ్మ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular