Homeఆంధ్రప్రదేశ్బాపట్లవేటపాలెం వాసవి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు

వేటపాలెం వాసవి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు

పది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు

ఉత్సవాల వివరాలు వెల్లడించిన వైశ్య సంఘం అధ్యక్షుడు మాజేటి వెంకట సుబ్బారావు

వేటపాలెం, అక్టోబర్ 10: వేటపాలెంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అక్టోబర్ 11 ఆదివారం నుంచి అక్టోబర్ 20 మంగళవారం వరకు దేవీ శరన్నవరాత్రోత్సవముల ను ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం అధ్యక్షుడు మాజేటి వెంకట సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల వివరాలను వెల్లడించారు.

పది రోజుల పాటు అమ్మవారికి వివిధ రూపాల్లో ప్రత్యేక అలంకరణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 11న బాలా త్రిపుర సుందరిదేవి అలంకారం, 12న గాయత్రీ దేవి అలంకారం, 13న కాత్యాయనీ దేవి అలంకారం, 14న అన్నపూర్ణ దేవి అలంకారం, 15న మహాలక్ష్మీ దేవి అమ్మవారు అలంకారం, 16న శ్రీ సరస్వతీ దేవి అలంకారం, 17న రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారం, 18న దుర్గాదేవి అలంకారం, 19న మహిషాసుర మర్దిని దేవి అలంకారం, 20న శ్రీ విజయ వాసవి దేవి అలంకారాలతో పూజలు నిర్వహించనున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో మాజేటి వెంకట సుబ్బారావు, బాపనపల్లి విప్రనారాయణ, శీరాం సుబ్బారాయుడు, కోడూరి రామకృష్ణ మరియు చుండూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని, దేవీ శరన్నవరాత్రోత్సవములను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular