వేటపాలెం, అక్టోబర్ 11 (పెన్ పవర్):
వేటపాలెంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం దసరా నవరాత్రుల ప్రారంభోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టి, జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం అఖండ కలశస్థాపన నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం అధ్యక్షులు మాజేటి వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నవరాత్రుల వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని సంఘం నిర్వాహకులు కోరారు.

