Homeఆంధ్రప్రదేశ్బాపట్లరామన్నపేటలో విషాదం.. ఏఆర్ కానిస్టేబుల్ మృతి

రామన్నపేటలో విషాదం.. ఏఆర్ కానిస్టేబుల్ మృతి

వేటపాలెం, అక్టోబరు 11 :

 

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటలో ఏఆర్ కానిస్టేబుల్ లేళ్ల వీరన్న (44) మృతి చెందాడు. గ్రామ పంచాయతీ పరిధిలో మంచినీటి సరఫరాకు వినియోగించే బావుల సమీపంలోని వేప చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం కనిపించింది.

 

ఘటనపై సమాచారం అందుకున్న వేటపాలెం ఎస్సై జనార్ధన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం చీరాల రూరల్ సీఐ సుధాకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడు జిల్లా ఎస్పీ, గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular