Homeఆంధ్రప్రదేశ్బాపట్లరామనగర్‌లో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

రామనగర్‌లో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

వేటపాలెం, అక్టోబర్ 14 :

వేటపాలెం మండలం రామనగర్‌లోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు, భక్తులు ఉత్సాహంగా కొలాటంలో పాల్గొని అమ్మవారిని స్మరించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రసాదం పంపిణీ చేశారు.

ఈ ఉత్సవాలకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular