Homeఆంధ్రప్రదేశ్బాపట్లరైతులకు ఆర్టీఐ చట్టంపై అవగాహన

రైతులకు ఆర్టీఐ చట్టంపై అవగాహన

వేటపాలెం, అక్టోబర్ 14 :

వేటపాలెం మండలం అక్కయ్యపాలెం రైతు సేవా కేంద్రంలో బుధవారం రైతులకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ యాక్ట్)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేటపాలెం మండల వ్యవసాయ అధికారి  ఎం. సరిత పాల్గొని రైతులకు ఆర్టీఐ చట్టం ఉపయోగాలు, దాని ద్వారా ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని ఏ విధంగా పొందవచ్చనే అంశాలపై వివరించారు.

ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు, తమకు అవసరమైన అధికారిక సమాచారాన్ని తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ఆర్టీఐ ద్వారా సమాచారం కోరే విధానం, దరఖాస్తు చేసుకునే ప్రక్రియ తదితర అంశాలను రైతులకు వివరించారు.

కార్యక్రమంలో వేటపాలెం మండల వ్యవసాయ సహాయకులు, రైతు సోదరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular