Homeఆంధ్రప్రదేశ్బాపట్లవేటపాలెం శ్రీ వాసవి ఆలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవ గానామృతం

వేటపాలెం శ్రీ వాసవి ఆలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవ గానామృతం

వేటపాలెం, అక్టోబర్ 14 : వేటపాలెంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ ఆలయంలో సలహా సంఘం ఆధ్వర్యంలో బుధవారం “శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ గానామృతం” కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

కీర్తిశేషులు శ్రీరామ్ వీరరఘునాథరావు గారి జ్ఞాపకార్థం, ఆయన భార్య వెంకటలక్ష్మి, కుమారుడు వెంకట శివకుమార్, జాహ్నవి దంపతుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ అధ్యక్షులు మాజేటి వెంకట సుబ్బారావు, కార్యదర్శి కోడూరి రామకృష్ణ తెలిపారు.

ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ గానామృత కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular