Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిబలమైన అభ్యర్థుల కోసం ప్రధాన పార్టీల కసరత్తు

బలమైన అభ్యర్థుల కోసం ప్రధాన పార్టీల కసరత్తు

టిడిపి చైర్మన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి?

వైసిపి చైర్మన్ అభ్యర్థి చింతకాయల అనిత?

వీరి పేర్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది…

నర్సీపట్నం, పెన్ పవర్ :

ఎలక్షన్ కమిషన్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. ఈనెల 16 నుంచి 18 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. 28న పోలింగ్ జరగగా, 30న ఫలితాలు ఇచ్చేలా షెడ్యూల్ ప్రకటించింది. దీంతో బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే 28 వార్డులలోను రెండు పార్టీలకు నాయకత్వం ఉండగా, కొత్తగా పెరిగిన 12 వార్డులకు అభ్యర్థుల కోసం గాలింపు మొదలైంది. బుధవారం రెండు ప్రధాన పార్టీల కార్యాలయాలు నాయకులతోనూ ఆశావాహులతోనూ కిటకిటలాడాయి. సహజంగానే అధికారం పార్టీలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. దానికి తోడు పొత్తులలో భాగంగా సీట్ల పంపకం కూడా పెద్ద తలనొప్పి వ్యవహారమే. రెండు ప్రధాన పార్టీలకు చైర్మన్ అభ్యర్థి దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. టిడిపి నుంచి స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి చింతకాయల అనిత పేర్లు ఖరారు అయినప్పటికీ అధికారికంగా ప్రకటించవలసి ఉంది. 40 వార్డులకు అభ్యర్థుల ఎంపికలో టిడిపి శిబిరంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయడంలో బిజీగా ఉన్నారు. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శిబిరంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అభ్యర్థులను ఖరారు చేయడంలో నిమగ్నమయ్యారు. కొత్త వార్డులకు నాయకత్వాన్ని సిద్ధం చేయడంతో పాటు, గత ఎన్నికలలో వైసిపి సింబల్ పై గెలిచి పార్టీ మారిన వార్డులలో, కొత్త నాయకత్వాన్ని తయారు చేసే పనిలో ఉన్నారు. శుక్రవారం నుండి నామినేషన్లు ప్రక్రియ మొదలవుతుండడంతో గురువారం రెండు పార్టీలు తమ జాబితాలను ప్రకటించే అవకాశం ఉంది. ప్రజా సమస్యలపై అవగాహన కలిగి, కౌన్సిల్ సమావేశంలో గొంతు వినిపించ గలిగే నాయకులను ఎంపిక చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular