Homeఆంధ్రప్రదేశ్బాపట్లనందిగుంటపాలెంలో పోలీసుల పల్లెనిద్ర

నందిగుంటపాలెంలో పోలీసుల పల్లెనిద్ర

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై అవగాహన

కారంచేడు, అక్టోబర్ 16 : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కారంచేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నందిగుంటపాలెం గ్రామంలో ఇంకొల్లు సీఐ రామనాయక్, కారంచేడు ఎస్సై పి.గోపి ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన పోలీసులు గ్రామస్థులతో సమావేశమై ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు.

ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular