- గూడెంకొత్తవీధి,పెన్ పవర్, అక్టోబర్ 23:జీకేవీధి జడ్పీటీసీ వైసీపీ టికెట్ ఆరుగురు ఆశావహుల్లో ఎవరికీ కాకుండా వేరే వారికి కేటాయిస్తే రెబల్‌గా పోటీ చేస్తామని మండల అధ్యక్షుడు కంకిపాటి గిరిప్రసాద్ తెలిపారు. గురువారం జీకేవీధిలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, డబ్బులు ఇస్తామన్న వారికి టికెట్ కేటాయించాలని చూడటం సరికాదన్నారు. డబ్బులతో టికెట్ తెచ్చుకున్న వారికి సహకరించబోమని స్పష్టం చేశారు.
జీకేవీధి వైసీపీ జడ్పీటీసీ టికెట్‌పై గిరిప్రసాద్ హెచ్చరిక
RELATED ARTICLES

