బాపట్ల, అక్టోబర్ 4 : జిల్లాకు వచ్చే విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, రిసార్టులు, గెస్ట్‌హౌస్‌లు, అద్దె ఇళ్లు, ఆసుపత్రులు, హాస్టళ్ల నిర్వాహకులు వారి బస వివరాలను 24 గంటల్లోగా ఫారం-సి ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులతో పాటు జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. విదేశీయులు చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు, వీసాతోనే జిల్లాలో ఉండాలని తెలిపారు.

