Homeఎడిటోరియల్ఢిల్లీలో కాంగ్రెస్ నేతలపై లాఠీఛార్జిను ఖండించిన పన్యాల జైపాల్ రెడ్డి

ఢిల్లీలో కాంగ్రెస్ నేతలపై లాఠీఛార్జిను ఖండించిన పన్యాల జైపాల్ రెడ్డి

ఢిల్లీలో కాంగ్రెస్ నేతలపై లాఠీఛార్జిను ఖండించిన పన్యాల జైపాల్ రెడ్డి

ఎల్బీనగర్, పెన్ పవర్ అక్టోబర్ 13:

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డికి గాయాలు కావడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై లాఠీఛార్జి చేయడం ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పన్యాల జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular