Homeఆంధ్రప్రదేశ్పోలవరంపోలవరం జిల్లా ఎస్పీ ఎదుట ముగ్గురు ఏసీఎం స్థాయి మావోయిస్టుల లొంగుబాటు

పోలవరం జిల్లా ఎస్పీ ఎదుట ముగ్గురు ఏసీఎం స్థాయి మావోయిస్టుల లొంగుబాటు

 రంపచోడవరం, పెన్ పవర్ అక్టోబర్ 27:

పోలవరం జిల్లా పోలీసు శాఖ చేపట్టిన చర్యల నేపథ్యంలో చింతూరు పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి ఐపీఎస్ ఎదుట ముగ్గురు ఏరియా కమిటీ సభ్యుల (ఏసీఎం) స్థాయి మావోయిస్టులు మంగళవారం స్వచ్ఛందంగా లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం చింతల్‌నార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మాడవి కోయింగ్ అలియాస్ రజని, హేమల హెడ్మా అలియాస్ దీపక్, గజరాజు పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన కొవ్వాసి జోగి అలియాస్ గంగి ఉన్నారు.

పలు ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నట్లు పోలీసుల వెల్లడి

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, వీరు 2013, 2014, 2017 సంవత్సరాల్లో జరిగిన మఠం ఫారెస్ట్, సబ్ ప్లాట్, వంగమెల్లి ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నారు. మావోయిస్టు కార్యక్రమాల్లో భాగంగా కళాజాతరల నిర్వహణతో పాటు తుపాకీ తూటాల అసెంబ్లింగ్‌లో వీరికి నైపుణ్యం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

మావోయిస్టు సిద్ధాంతాలపై అసంతృప్తితో లొంగుబాటు

మావోయిస్టు సిద్ధాంతాలకు, ఆచరణకు మధ్య వ్యత్యాసాలు ఉండటం, కుల వివక్ష, కొన్ని కులాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల్లో మావోయిస్టు కార్యకలాపాలకు ఆదరణ తగ్గడం, పోలీసుల గస్తీ పెరగడంతో ప్రాణహాని ఉంటుందనే భయంతో హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నట్లు లొంగిపోయిన వారు వెల్లడించారని పేర్కొన్నారు.

పునరావాస ప్రయోజనాలు కల్పిస్తాం: ఎస్పీ

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి మాట్లాడుతూ, మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచిపెట్టి స్వచ్ఛందంగా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాస ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • ఈ కార్యక్రమంలో చింతూరు ఓఎస్డీ అడ్మిన్ జావలి, చింతూరు సీఆర్‌పీఎఫ్ ఏకే దీప టూఐసీ, డీఎస్పీ ఉదయ పావని, సీఐ గోపాలకృష్ణ, ఎస్‌ఐ సంతోష్ కుమార్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular