Homeఆంధ్రప్రదేశ్స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా అరకు ఎంపీ ప్రచారం

స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా అరకు ఎంపీ ప్రచారం

  • లకవరపుపేట, పెదవలస, రింతాడలో తనూజారాణి పర్యటన.. పెదవలస సంతలో ర్యాలీ
  • గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 30:స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా అరకు ఎంపీ తనూజారాణి శుక్రవారం గూడెంకొత్తవీధి మండలంలోని లకవరపుపేట, పెదవలస, రింతాడ గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే కే. భాగ్యలక్ష్మితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెదవలస వారపు సంతలో ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా తనూజారాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. నామినేషన్ల సమయంలో వైసీపీ నాయకులకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆరోపించారు. ప్రజలు స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. వైఎస్ జగన్ పాలన తిరిగి రావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జీకే వీధి జడ్పీటీసీ అభ్యర్థి కంకిపాటి గిరిప్రసాద్, మాజీ ఎంపీపీ బోయిన కుమారి, వైసీపీ జిల్లా కోశాధికారి కుందరి రామకృష్ణ, మండల నాయకులు నారాయణ, పిండి రామకృష్ణ, కంకిపాటి రామారావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular