*అధ్వానంగా పారిశుద్ధ్యం*
*మౌలిక వసతులు కరువు*
గార్ల, పెన్ పవర్, నవంబర్: 2
పేరులో భాగ్యం ఉన్నా.. తీరులో మాత్రం దౌర్భగ్యంగా ఉంది. గార్ల మండల కేంద్రంలోని స్థానిక బసవతారక్ నగర్ వికలాంగుల కాలనీలో ని ప్రధాన రోడ్డు లు బురదమయంగా మారింది చిన్నపాటి వర్షం వచ్చినా చాలు రోడ్డుపై నడవాలంటే నరకయాత పడుతున్నామని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు డ్రైనేజీ కూడా లేక మురుగునీరు రోడ్డు మీద ప్రవహిస్తుందని దీంతో బయట నుంచి ఇంట్లోకి వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోయారు దీనికి తోడు పారిశుద్ధ్య సమస్య ఏర్పడడంతో రోడ్డుపైన నిలిచిన మురుగునీరుదోమలకు ఆవాసాలుగా మారి విష జ్వరాలు విజృంభిస్తూ అనారోగ్యం బారిన పడుతున్నామని ఇటీవల కాలంలో డెంగ్యూ కేసు నమోదయిందని. వారు ఆందోళన వ్యక్తం చేశారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి పారిశుద్ధ్యం పనులు నిర్వహించిమురుగునీరు తొలగించే ఏర్పాటు చేసి వ్యాధుల బారిన పడకుండా చూడాలని వేడుకున్నారు.

