స్వామి దర్శన భాగ్యంతో పులకించిన భక్తులు
గార్ల, పెన్ పవర్, నవంబర్: 1
గార్ల మండలంలోని మర్రిగూడెం వేట వేంకటేశ్వర స్వామివారు బ్రహ్మోత్సవాలను ముగించుకొని ఆదివారం రాత్రి గార్లకు చేరుకున్నారు. వేంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి గోదాదేవి సమేత ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా పూలమాలలతో అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి మేళతాళాల నడుమ గార్ల పురవీధుల్లో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. స్వామివారిని గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దంపతులు పార్వతీహతిరం నాయక్ లు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేవాలయానికి చేర్చారు. ఊరేగింపులో భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతిఏటా బ్రహ్మోత్సవాల అనంతరం ఉత్సవ విగ్రహాలను గార్లలోని దేవాలయానికి తరలించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు అచ్చుతాచార్య తెలిపారు. ఈ కార్యక్ర మంలో మర్రిగూడెం ఆలయ ఈఓ సత్యనారాయణ, చైర్మన్ అజ్మీరా బన్సలాల్ వైస్ చైర్మన్ అర్జునా టీటీడీ ధర్మ ప్రచార కమిటీ సభ్యులు రాములు నాయక్ అర్చకులు అచ్చుతాచార్యులు, గోవిందా చార్యులు, పుల్లఖండం రమేష్ బాబు, పరుచూరి కుటుం బరావు, కట్ట రమేష్ సత్యం, కోట శ్రీను తదితరులు పాల్గొన్నారు.

