గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 7:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండల జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థి కంకిపాటి గిరి ప్రసాద్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జనసేన, సీపీఐ సహా ఇతర పార్టీల అభ్యర్థులను వెనక్కి నెట్టి ఆయన ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

