Homeఆంధ్రప్రదేశ్బాపట్లదేవాంగపురి–3లో సిద్ధి సునీతకు ఘన విజయం.. టీడీపీకి ప్రజల పట్టాభిషేకం

దేవాంగపురి–3లో సిద్ధి సునీతకు ఘన విజయం.. టీడీపీకి ప్రజల పట్టాభిషేకం

చీరాల, నవంబరు 7 :

దేవాంగపురి–3 ఎంపీటీసీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని సిద్ధి సునీత విజయదుందుభి మోగించారు. తన సమీప ప్రత్యర్థిపై 600కు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి టీడీపీ జెండాను ఎగురవేశారు. ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త సిద్ధి బుచ్చేశ్వరరావు సతీమణి అయిన ఆమెకు ఓటర్లు ఘన విజయాన్ని అందించారు.

విజయం అనంతరం సిద్ధి సునీత మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి ఆదరించిన ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు తన వ్యక్తిగత విజయంగా కాకుండా, తనను నమ్మి అండగా నిలిచిన ప్రజల విజయంగా అభివర్ణించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, నిత్యం వారికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. గ్రామంలోని సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular