కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కాప్రా, పెన్ పవర్, నవంబర్ 7:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) నివాసానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కేటీఆర్‌తో జరిగిన భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై కూడా చర్చించినట్లు తెలిపారు.

