Homeఆంధ్రప్రదేశ్పోలవరంగంగవరం శాఖా గ్రంథాలయంలో ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు

గంగవరం శాఖా గ్రంథాలయంలో ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు

 

**చిల్డ్రన్స్ డే సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు**

**విద్యార్థులకు విలువైన సందేశం అందించిన ముఖ్య అతిథి కే. పండుదొర**

**గంగవరం, పెన్ పవర్, నవంబర్ 14:**

గంగవరం శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలను శనివారం ఘనంగా ప్రారంభించారు. వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమాన్ని శాఖా గ్రంథాలయ అధికారిణి బి. గంగాభవాని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన కే. పండుదొర (అసిస్టెంట్ మేనేజర్) నెహ్రూ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్య యొక్క ప్రాముఖ్యత, పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు, బాలలు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని జీవితంలో అభివృద్ధి సాధించాల్సిన ఆవశ్యకతపై విలువైన సందేశాన్ని అందించారు.

ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారిణి బి. గంగాభవాని మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా వారం రోజులపాటు నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలను అతిథులకు, పాఠకులకు వివరించారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతోపాటు వారి సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించనున్న వివిధ పోటీల వివరాలను తెలియజేశారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular