Homeఎడిటోరియల్దామనపల్లిలో వైసీపీ అభ్యర్థిత్వంపై వివాదం..పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి 

దామనపల్లిలో వైసీపీ అభ్యర్థిత్వంపై వివాదం..పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి 

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 23:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం దామనపల్లి పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థిగా వంతల కాసులమ్మను పార్టీ అధిష్టానం నిర్ణయించిందని, ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు పార్టీ పేరు, జెండాలను ఉపయోగించి ఓటర్లలో గందరగోళం సృష్టించకూడదని చంటిబాబు కోరారు.గతంలో గొడుగుమామిడి నుంచి విజయ్ పోటీ చేసిన సందర్భంలో ఇదే అంశంపై నాయకులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకోవాలని అన్నారు. ఇవి పార్టీ గుర్తులేని ఎన్నికలని, ఎవరైనా పోటీ చేయవచ్చనే వాదనలున్నప్పటికీ, పార్టీ అధిష్టానం మద్దతు ఉన్నట్లు ప్రచారం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. పార్టీ జెండాలు, గుర్తులు లేకుండా ప్రజల మద్దతు పొందాలని సూచించారు.పార్టీ అధిష్టానం తమకు టికెట్ ఇచ్చిందని, హామీ ఇచ్చిందని చెబుతున్న వారు అందుకు సంబంధించిన ఆధారాలు లేదా అధికారిక ప్రకటనలను ప్రజల ముందు ఉంచాలని కోరారు. నిజమైన వైఎస్సార్‌సీపీ అభిమానులు పార్టీ అధిష్టానం సూచించిన అభ్యర్థికి మద్దతుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న నాయకులు గ్రామాభివృద్ధికి చేసిన పనులపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, చర్చిలు నిర్మిస్తామని,కళ్ళబోల్లి వివిధ హామీలు ఇస్తున్నారని పేర్కొంటూ, ఓటర్లు ఇలాంటి హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular