Homeఆంధ్రప్రదేశ్కాకినాడతనుమళ్ళలో అత్తాకోడళ్ల మధ్య ఆసక్తికర పోరు

తనుమళ్ళలో అత్తాకోడళ్ల మధ్య ఆసక్తికర పోరు

కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 28:

కాజులూరు మండల పరిధిలోని తనుమళ్ళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్తాకోడళ్ల మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. కూటమి తరఫున రాయి మైథిలి రమేష్ కత్తెర గుర్తుపై సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవగా, ఆమెకు వరుసకు అత్త అయిన రాయి అనంతలక్ష్మి మంచం గుర్తుపై పోటీ చేస్తున్నారు. గతంలో గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన అనంతలక్ష్మి, ప్రస్తుతం తన కోడలిపై పోటీకి దిగడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలు మైథిలికి కొత్త అయినప్పటికీ, కూటమి నాయకులు, గ్రామస్తుల మద్దతు ఆమెకు లభిస్తోంది. ఈ నేపథ్యంలో తన కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మైథిలి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తన గెలుపుపై ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular