Homeతెలంగాణరంగారెడ్డిమన్సూరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత.. ఒకరి అరెస్ట్

మన్సూరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత.. ఒకరి అరెస్ట్

మన్సూరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత..

రూ.1.20 లక్షల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం.. ఒకరి అరెస్టు

ఎల్బీనగర్, పెన్ పవర్ నవంబర్ 28:

మన్సూరాబాద్ చెరువు కట్ట వద్ద మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలపై హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి సుమారు రూ.1.20 లక్షల విలువైన 7.88 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎం.ఏ. రజాక్ ఆదేశాల మేరకు నవంబర్ 27న రాత్రి 10 గంటల సమయంలో మన్సూరాబాద్ చెరువు కట్ట వద్ద ఎక్సైజ్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఎండీఎంఏ విక్రయిస్తున్న ఎడపల్లి మనోజ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద ఉన్న 7.88 గ్రాముల ఎండీఎంఏతో పాటు నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మిర్యాల లెనిన్ అనే వ్యక్తి విక్రయాల కోసం తనకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు నిందితుడు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరూ కలిసి ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టయిన నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. హయత్‌నగర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ బి. సంతోష్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ దాడిలో ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్లు జబ్బార్, ఉమారాణి, కానిస్టేబుళ్లు భాస్కర్, అఖిల్, చాణక్య, సుమన్, సాయిరాం, భవాని పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular