ePaper
Thursday, April 30, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగుల సన్మానం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగుల సన్మానం

📰 Generate e-Paper Clip

గంగవరం, పెన్ పవర్, మార్చి 7:

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గిరికిరణం ఆగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో గంగవరం ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సంస్థ చైర్మన్ టి. వెంకటరమణ, డైరెక్టర్ జడ్పిటిసి ఎ. రత్నం (బేబీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళా ఉద్యోగులను గుర్తించి సన్మానించారు.మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి కృషి అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

 

వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులను ఆయా విభాగాల నుంచి “బెస్ట్ ఎంప్లాయీ”గా ఎంపిక చేసి శాలువాలు, స్మారక చిహ్నాలతో సత్కరించారు.ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ లక్ష్మణరావు, సీడీపీఓ సుచరిత ఆదిలక్ష్మి, ఏపీఎం అప్పలకొండ, వైస్ ఎంపీపీ గంగాదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్లు, డ్వాక్రా మహిళలు, గిరికిరణం సంస్థ ఉద్యోగులు, కోఆర్డినేటర్లు, ట్రైనింగ్ టీచర్లు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular