ePaper
Wednesday, May 13, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లికాపువీధి రామాలయంలో ద్వజస్థంబం ప్రతిష్ట

కాపువీధి రామాలయంలో ద్వజస్థంబం ప్రతిష్ట

📰 Generate e-Paper Clip

కాపువీధి రామాలయం ద్వజస్థంబం ప్రతిష్ట

-పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గణేష్

-ఆలయ అభివృద్దికి లక్ష విరాళం అందజేత

నర్సీపట్నం, పెన్ పవర్ :

నర్సీపట్నం మున్సిపాలిటీ కాపువీధిలో శ్రీసీతారామాంజనేయ స్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ హాజరయ్యారు. తాజా మాజీ కౌన్సిలర్ దాడి కృష్ణవేణి, బుజ్జి దంపతులు ఉమాశంకర్ గణేష్ కు ఘన స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం చేసుకున్న అనంతరం ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి లక్ష రూపాయల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, సిరసపల్లి నాని, యాదగిరి శేషు, వికాస్ సతీష్, మళ్ళ గణేష్, తమరాన శ్రీను, చిటికెల కన్నా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular