Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుఅత్తికల్ లో భారీ వర్షానికి కూలిన ఇంటి మట్టి గోడలు : నిరాశ్రయులైన కుటుంబం 

అత్తికల్ లో భారీ వర్షానికి కూలిన ఇంటి మట్టి గోడలు : నిరాశ్రయులైన కుటుంబం 

  • బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
  • సిపిఎం నాయకుడు వంతాల నీలకంఠం.
  • ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఆగస్టు 23:ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ, అతికల్ గ్రామానికి చెందిన పాంగి రామచందర్ గృహము యొక్క మట్టి గోడలు కూలిపోయాయని సిపిఎం మండల నాయకుడు వంతాల నీలకంఠం తెలిపారు. ఆదివారం అయన మాట్లాడుతూ.. భారీ వర్షాలకు ఆదివారం గోడలు తడిచి నేల కూలయని అన్నారు. పేద కుటుంబాము, నిలువ నీడ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయనీ, ఆహారం, వసతి లేక, సర్వం కోల్పోయి వీధిన పడ్డాయన్నారు. బాధితుడి దయనీయ స్థితి హృదయ విదారకంగా ఉందని, ఇళ్లు కూలిపోవడంతో తల దాచుకోవడానికి చోటు లేక బాధిత కుటుంబం నిరాశ్రయులయ్యారన్నారు. ప్రభుత్వం తక్షణమే పునరావాసం కల్పించాలని, కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని నీలకంఠం విజ్ఞప్తి చేశారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular