ePaper
Saturday, March 21, 2026
spot_img
ePaper
Homeఎడిటోరియల్ఒంటరి పోరుకే విజయ్ సిద్ధం

ఒంటరి పోరుకే విజయ్ సిద్ధం

📰 Generate e-Paper Clip

  • 234 స్థానాల్లో ఒంటరి పోటీ – TVK పార్టీ వ్యూహం

  • ఇతర పార్టీల పొత్తు ఆఫర్లు తిరస్కరణ

  • విజయ్ రాజకీయాల్లోకి అడుగు – సినీ కెరీర్ ముగింపు

  • యువ ఓటర్ల మద్దతు – 35 ఏళ్లు లోపు ప్రభావం

  • డీఎంకె & భాజపా వ్యూహాలను టార్గెట్ చేయడం

  • ఎన్డీయేలో చేరడానికి ఆఫర్లు, కానీ తిరస్కరణ

  • తమిళ ప్రజల కోసం ప్రత్యేక అజెండా

  • ముస్లిం & క్రైస్తవ వర్గాల ఆకాంక్షలకు అండ

  • ఎన్నికల ప్రభావం – దక్షిణాది రాజకీయ రంగం

  • జననాయగన్ విడుదల & రాజకీయ వార్తల సంచలనం

 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనుండగా, సొంత అజెండా కోసం ఇతర పార్టీలతో పొత్తులు సవివరంగా తిరస్కరించింది. 33 ఏళ్ల సినీ కెరీర్ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న ఆయన దక్షిణాది రాజకీయాలను కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది.

చెన్నై, పెన్ పవర్ మార్చి20: 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు టీవీకే పార్టీ ఎన్నికల ప్రచార నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఆదవ్‌ అర్జున తెలిపారు. టీవీకే పార్టీ అధినేతకు పలు పార్టీల నుంచి పొత్తు కోసం ఆఫర్లు వచ్చినా, దళపతి వాటిని సున్నితంగా తిరస్కరించారని పేర్కొన్నారు. ఢిల్లీ నేతలకు సలాం కొట్టడం ఇష్టం లేక, సొంత అజెండా ఉండటం ముఖ్యమని భావించినట్లు చెప్పుకొచ్చారు.దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. ఇదివరకే ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. మే 4న ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటించనుంది. సాధారణంగా గత కొన్ని దశాబ్ధాలుగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడిఎంకె నేతృత్వంలోని కూటములు, నామ్ తమిళర్ పార్టీ ఒంటరిగా పోటీ చేసేవి. అయితే ఈసారి నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం TVK పార్టీ రేసులోకి రావడం రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసింది. అందులోనూ ఏ పార్టీతో పొత్తు లేకుండా టీవీకే సొంతంగా పోటీ చేయనుండటం తమిళ ప్రజలతో పాటు దక్షిణాదిని ఆకర్షిస్తోంది. ప్రజల కోసం పనిచేస్తానని, ఇతర పార్టీలతో కలిసి అధికారాన్ని పంచుకునేది లేదని విజయ్ భావిస్తున్నారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ తమిళ సినిమా పరిశ్రమలో స్టార్ హీరో. 33 ఏళ్లుగా హీరోగా నటిస్తున్న విజయ్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. ఆయన చివరి సినిమా జననాయగన్ విడుదులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. పిల్లల నుంచి వద్ధుల వరకు అన్ని వయసు వారిలో అభిమానులు ఉన్నారు. గతంలో పలువురు ప్రముఖులు సినిమా నుంచి రాజకీయాలకు వచ్చి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు విజయ్ సినీ రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి వస్తున్నారు. యువత నుంచి 35 ఏళ్లలోపు యువ ఓటర్ల మద్దతు విజయ్‌కు ఉందని టీవీకే పార్టీ నేతలు చెబుతున్నారు. విజయ్ అధికార పార్టీ డిఎంకెను రాజకీయ శత్రువుగా, భాజపాను సిద్ధాంతపరంగా శత్రువుగా భావించి విమర్శలు గుప్పించారు. అన్ని వేదికలపై డిఎంకెను తీవ్రంగా విమర్శించారు. ఈ ఎన్నికల్లో అన్నాడిఎంకె నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్( లో బీజేపీ భాగస్వామిగా ఉన్నందున, విజయ్‌ను తమ వైపు లాగితే, డిఎంకెను దెబ్బకొట్టొచ్చని భావించారని ప్రచారం జరిగింది. ఎన్డీయేలో చేరాలని విజయ్ తో బీజేపీ నేతలు చర్చించారని టీవీకే నేత ఆదవ్‌ అర్జున పేర్కొన్నారు. ఓ పెద్ద పదవి సైతం ఆఫర్ చేసినా విజయ్ రిజెక్ట్ చేశారన సంచలన విషయాలు వెల్లడించారు. కానీ విజయ్‌తో ఎలాంటి చర్చలు జరపలేదని బీజేపీ సహా ఎన్డీయే నేతలు స్పందిస్తున్నారు.చెన్నై కొలత్తూర్‌లో జరిగిన టీవీకే కార్యక్రమంలో ఆదవ్‌ అర్జున మాట్లాడుతూ.. ‘ తమిళ ప్రజలకు ఈ రోజు ఒక విషయం చెప్పాలి. ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు ఉపవాసం చేస్తున్న ఈ సమయంలో తమిళ ప్రజలకు ఈ విషయం స్పష్టం చేస్తున్నాం. తమిళనాడులోని 234 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నాం. ముస్లిం, క్రైస్తవులకు అండగా ఉంటాం. అన్ని వర్గాల వారి ఆకాంక్షలు నెరవేర్చుతాం. విజయ్‌ని తమ కూటమిలో చేర్చుకోవాలని పలు పార్టీలు ప్రయత్నించాయని, పదవులు ఆఫర్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జననాయగన్ విడుదలకు అడ్డంకులు రావడానికి కారణం ఇదేనంటూ పిడుగు లాంటి వార్త చెప్పారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular