ePaper
Saturday, March 21, 2026
spot_img
ePaper
Homeఆంధ్రప్రదేశ్హైకోర్టు న్యాయమూర్తికి సమస్యలపై వినతి

హైకోర్టు న్యాయమూర్తికి సమస్యలపై వినతి

📰 Generate e-Paper Clip

 

* కోర్టు భవనంపై జస్టిస్ కిరణ్మయి మండవతో చర్చలు
రంపచోడవరంలో హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన న్యాయవాదులు
* స్థానిక కోర్టు సమస్యల పరిష్కారానికి న్యాయవాదుల విజ్ఞప్తి
* కోర్టు భవన నిర్మాణంపై జస్టిస్ కిరణ్మయి దృష్టికి సమస్యలు

 

  1. గంగవరం/రంపచోడవరం, పెన్ పవర్
    హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి మండవను శుక్రవారం రంపచోడవరంలో స్థానిక న్యాయవర్గ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మురళి గంగాధర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవీఆర్పీ భగవాన్ తదితరులు న్యాయమూర్తిని కలిసి పలు సమస్యలను వివరించారు.కుటుంబ సభ్యులతో కలిసి మారేడుమిల్లి సందర్శనకు వచ్చిన జస్టిస్ కిరణ్మయి మండవతో వారు కోర్టు సంబంధిత అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కోర్టు భవన నిర్మాణం, ఇప్పటికే కేటాయించిన స్థలం వినియోగం, న్యాయసేవల మెరుగుదల వంటి విషయాలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని న్యాయవాదులు వినతి పత్రం సమర్పించినట్లు తెలిసింది.వారి అభ్యర్థనలను ఆత్మీయంగా విన్న న్యాయమూర్తి సంబంధిత అంశాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.
  2. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు భగవాన్, కోర్టు సిబ్బంది పైడి రాజు, నాగభూషణం, శేషు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular