Homeఆంధ్రప్రదేశ్కమ్మవారిపాలెం గ్రామ పరిధిలో జింక మృతి..

కమ్మవారిపాలెం గ్రామ పరిధిలో జింక మృతి..

అనారోగ్యంతోనే చనిపోయినట్లు అధికారుల నిర్ధారణ..

చిలకలూరిపేట , పెన్ పవర్, ఆగస్టు 11 :

పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ పరిధిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కమ్మవారిపాలెం గ్రామ పరిధిలోని పోలేరమ్మ గుడి ఎదురుగా ఉన్న పంట కాలువ పక్కన ఒక జింక మృతి చెందింది. స్థానికులు గమనించిన వెంటనే అందించిన సమాచారంతో అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై ఘటనాస్థలికి చేరుకున్నారు. కోటప్పకొండ బీట్ ఆఫీసర్ కిరణ్ ఆధ్వర్యంలో అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.అనంతరం పశువైద్యులు జింక మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.

వైద్యుల ప్రాథమిక నిర్ధారణ ప్రకారం..

జింకకు ఎలాంటి బాహ్య గాయాలు లేవని, కేవలం అనారోగ్యంతోనే ఇది మృతి చెందిందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ,అటవీ ప్రాంతం చుట్టు పక్కల ఎక్కడైనా వన్యప్రాణులు మృతి చెందినా లేదా గాయపడినా ప్రజలు వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular