బాధితుడికి ఫోన్ అప్పగించిన ఎడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణ.
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 22 :
ఎడ్లపాడు: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో వెతికి పట్టుకోవడంలో పోలీసులు మరోసారి తమ పనితీరును చాటుకున్నారు. ఎడ్లపాడు మండలం మైదవోలుగ్రామానికి చెందిన హర్ష వర్ధన్ తన మొబైల్ ఫోన్ పోగొట్టుకోవడంతో ఎడ్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.బాధితుడి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ఎడ్లపాడు సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ, మొబైల్ ట్రాకింగ్ ద్వారా దర్యాప్తు ప్రారంభించారు.సాంకేతిక ఆధారాల సాయంతో సదరు మొబైల్ ఫోన్ ఒడిశా రాష్ట్రంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.వెంటనే అక్కడి అధికారులతో సమన్వయం చేసుకొని,ఫోన్‌ను సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు.
బాధితుడికి అందజేత
ఎడ్లపాడు పోలీస్ స్టేషన్‌లో అన్ని ధృవీకరణ పత్రాలను పరిశీలించిన అనంతరం,ఎస్ఐ శివరామకృష్ణ చేతుల మీదుగా ఫోన్‌ను హర్ష వర్ధన్‌కు అందజేశారు. పోగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి ఇప్పించినందుకు బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
పోలీసుల సూచన
ఈ సందర్భంగా ఎస్ఐటి శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు తమ విలువైన వస్తువులు లేదా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఆధునిక సాంకేతికత సాయంతో ఇలాంటి కేసులను ఛేదించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు అని తెలిపారు.
రిపోర్టర్ వివరాలు
పేరు: SRIKANTH NARASIMHALAహోదా: STAFF REPORTER
ప్రాంతం: CHILAKALURI PETA, PALNADU DIST



