అంగన్‌వాడీ కార్యకర్త హెప్సీభా
పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 28
7పుల్లల చెరువు గ్రామంలో చిన్నారుల విద్యాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా అంగన్‌వాడీ కేంద్రం ఎస్సీ–2 ఆధ్వర్యంలో ఈసీసీఈ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం గ్రామంలో విద్యాపట్ల అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది.3 నుంచి 5 సంవత్సరాల మధ్య వయస్సు గల చిన్నారులు విద్యా సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా ఈ వేడుకలను నిర్వహించారు.చిన్నారుల మానసిక, శారీరక అభివృద్ధికి ప్రాథమిక విద్య ఎంత ముఖ్యమో తెలియజేస్తూ గ్రామస్థుల సమక్షంలో ఉత్సాహభరిత వాతావరణంలో కార్యక్రమాలు కొనసాగాయి.చిన్నారులు పాటలు, ఆటలు, వినోదాత్మక కార్యక్రమాలతో సందడి చేసి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా పుల్లల చెరువు ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వేముల కోటేశ్వరరావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆయన చేతుల మీదుగా 5 సంవత్సరాలు పూర్తయిన చిన్నారుల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిన్నారుల తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆహ్వానించి, తమ పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కార్యకర్త హెబ్సీబా మాట్లాడుతూ గ్రామంలో విద్యాభివృద్ధి సాధనకు ఇది ముఖ్యమైన అడుగని ఆమె అన్నారు.ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను భాగంగా తీసుకొని, ప్రతి చిన్నారికి ప్రాథమిక విద్య అందేలా చర్యలు తీసుకోవాలని అంగన్‌వాడీ సిబ్బంది కృషి చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పిల్లల పోషణ, ఆరోగ్య సంరక్షణ, విద్యాపట్ల బాధ్యతలపై అవగాహన కల్పించారు.చిన్నారుల భవిష్యత్తు బాగుండాలంటే ప్రారంభ దశ నుంచే సరైన దిశలో విద్య అందించాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.గ్రామంలోని తల్లిదండ్రులు పాల్గొని తమ పిల్లల విద్యపై ఆసక్తి చూపించారు. చిన్నారుల భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.


