ePaper
Saturday, March 28, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుపెదవలస వారపు సంత ఆశీలు వసూలుకు బహిరంగ వేలం

పెదవలస వారపు సంత ఆశీలు వసూలుకు బహిరంగ వేలం

📰 Generate e-Paper Clip

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 28 :అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెం కొత్తవీధి మండలం పరిధిలోని పెదవలస గ్రామపంచాయతీకి చెందిన వారపు సంత ఆశీలు వసూలు హక్కుల కోసం ఈ నెల 31వ తేదీన బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు పంచాయితీ కార్యదర్శి కిట్లంగి బాలకృష్ణ తెలిపారు.2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ వేలం కార్యక్రమం గ్రామ సర్పంచ్ పి. కృష్ణారావు ఆధ్వర్యంలో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యక్తులు అదే రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. తదుపరి మధ్యాహ్నం 3 గంటలకు అధికారికంగా వేలం పాట నిర్వహించబడుతుందని, పాల్గొనదలచిన వారు సమయానికి హాజరు కావాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular