Homeఆంధ్రప్రదేశ్సమన్వయంతో పనిచేద్దాం.. స్థానిక ఎన్నికల్లోగెలుద్దాం

సమన్వయంతో పనిచేద్దాం.. స్థానిక ఎన్నికల్లోగెలుద్దాం

స్టాఫ్ రిపోర్టర్ పాడేరు, పెన్ పవర్,అక్టోబర్ 9: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా జనసేన నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పాడేరు నియోజకవర్గ పార్టీ సీనియర్లు చర్చించారు. రాష్ట్ర, స్థానిక కమిటీలతో సమన్వయం చేసుకుంటూ అన్ని మండలాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నిర్ణయించారు. వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా పార్టీ గెలుపునకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ చర్చలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య, ఉమ్మడి విశాఖ జిల్లా ఉపాధ్యక్షురాలు కిట్లంగి పద్మ, సీనియర్ నాయకులు సీదరి రామ్మూర్తి, వంతాల సుబ్బారావు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular