పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 29
మండల వ్యాప్తంగా క్రైస్తవులు మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించారు.పట్టణ, గ్రామాల్లోని వీధుల్లో ఈత మట్టలతో ఊరేగింపు నిర్వహించారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.పుల్లల చెరువు మండల కేంద్రంలో క్రైస్తవ భక్తి భావాలు ఉట్టిపడేలా తెలుగు బాప్టిస్ సంఘం సండేస్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా ర్యాలీ ఆదివారం ఆకట్టుకుంది. గుడ్ ఫ్రైడే సందర్భంగా ముందస్తుగా నిర్వహించే మట్టల ఆదివారము ఆచారంలో భాగంగా చిన్నారులు వీధి వీధి తిరుగుతూ హోసన్నా జయం…హోసన్నా జయం…రాజుల రాజుకే జయం.. క్రీస్తు రాజుకే జయం అంటూ నినాదాలు చేస్తూ భక్తి శ్రద్ధలతో జయధ్వానాలు చేశారు.చిన్నారుల ఉత్సాహం, వారి స్వచ్ఛమైన భక్తి భావాలు చూసిన స్థానికులు కూడా కాసేపు ఆగి ఆశీర్వాదాలు అందించారు.చేతుల్లో ఆకుల కొమ్మలు, క్రైస్తవ చిహ్నాలతో అలంకరించిన విద్యార్థులు శాంతి, ప్రేమ, సహనానికి ప్రతీకగా నిలిచారు.గ్రామంలోని ప్రధాన వీధులన్నింటిలో ర్యాలీ కొనసాగుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.ఈ సందర్భంగా సండేశ్ స్కూల్ టీచర్ బడిపాటి యేసురత్నం మాట్లాడుతూ గుడ్ ఫ్రైడేకు ముందు జరిగే మట్టల ఆదివారము క్రైస్తవ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. యేసు క్రీస్తు యెరూషలేములో ప్రవేశించిన సందర్భంగా ప్రజలు హోసన్నా అంటూ స్వాగతం పలికిన సంఘటనను స్మరించుకునే ఆచారమే ఇదని వివరించారు.చిన్నారుల్లో భక్తి, సేవా భావాలు పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని తెలిపారు.గ్రామ ప్రజలు కూడా ఈ ర్యాలీకి సహకరిస్తూ పిల్లలను ప్రోత్సహించడం విశేషంగా నిలిచింది. మొత్తంగా పుల్లల చెరువు మండలంలో ఆదివారం ఆధ్యాత్మిక ఉత్సాహం నిండిన వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో వ్యవనస్తలు లింగంగుంట్ల మరియదాస్, దొరడ్ల యోగయ్య, ఆరేవుల రాజశేఖర్ ప్రతాప్ కుమార్ (జెన్ను),లింగంగుంట్ల నిరీక్షణ్ పాల్గొన్నారు.

