Homeఆంధ్రప్రదేశ్రావణ్ అండ్ కో వెనుక ఉన్నది వైసీపీయే!

రావణ్ అండ్ కో వెనుక ఉన్నది వైసీపీయే!

ఆంధ్రప్రదేశ్ జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య ఆరోపణ

స్టాప్ రిపోర్టర్,పాడేరు, పెన్ పవర్, జూలై 10:రావణ్ అండ్ కో వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని, రాష్ట్రంలో క్రైస్తవులను రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్, జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం–అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య ఆరోపించారు. పాడేరులోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రావణ్‌తో కలిసి పనిచేసిన వ్యక్తులు సరిపోక, ఇప్పుడు నేరుగా వైసీపీ నేతలే రంగంలోకి దిగారని ఆరోపించారు. యూపీఏ కేసులో అరెస్టైన రావణ్‌కు న్యాయ సహాయం అందిస్తామని వైసీపీ ప్రకటించడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, అయినప్పటికీ కొందరు కావాలనే క్రైస్తవులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో హిందూ దేవతలను, సనాతన ధర్మాన్ని కించపరిచేలా కొందరు వ్యక్తులు, యూట్యూబ్ ఛానళ్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ శంఖారావం సభలో దళితులు, క్రైస్తవుల సంక్షేమంపై కాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారని గంగులయ్య ఆరోపించారు.దేశ సమైక్యత, సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని కొన్ని వర్గాలు పనిచేస్తున్నాయని అన్నారు. జడ శ్రావణ్ కుమార్ తాను జగన్‌పై పోరాటానికి రూ.25 కోట్లు ఖర్చు చేశానని చెప్పారని, అంత డబ్బు ఆయనకు ఎలా వచ్చిందో ప్రజలకు వివరించాలని గంగులయ్య డిమాండ్ చేశారు. న్యాయవాదిగా పెద్దగా ప్రాక్టీస్ చేయని వ్యక్తికి అంత ఆస్తి ఎలా సమకూరిందో వెల్లడించాలని కోరారు.సుగాలి ప్రీతి కుటుంబానికి సంబంధించి జడ శ్రావణ్ కుమార్‌పై వస్తున్న ఆరోపణలు, బార్ కౌన్సిల్ రికార్డుల్లో ఉన్న వివరాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రావణ్, శ్రావణ్, ప్రకాష్ రాజ్‌ల మధ్య ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై కూడా దర్యాప్తు జరగాలని కోరారు.రాష్ట్రంలో మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు ఏవైనా కుట్రలు జరుగుతున్నాయా అనే కోణంలో పోలీసులు సమగ్ర విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని గంగులయ్య పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular