రంపచోడవరం, జూలై 10 (పెన్ పవర్):
పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరం సమీపంలోని ఐ. పోలవరం గోవిందగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం (జూలై 11) తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి తీసుకువచ్చిన శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ అంచూరి శిరీష తెలిపారు.
ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, పవిత్ర లడ్డు ప్రసాదాన్ని స్వీకరించాలని ఆమె కోరారు.
అలాగే గోవిందగిరి ఆలయంలో స్వామివారికి మొక్కుకుని వరుసగా 9 శనివారాలు 11 ప్రదక్షిణలు చేసే భక్తుల కోర్కెలు నెరవేరుతాయని భక్తులలో ప్రగాఢ విశ్వాసం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.

