చిలకలూరిపేట రూరల్ ,పెన్ పవర్, జూలై 10:
నాదెండ్ల : నాదెండ్ల–తుబాడు గ్రామాల మధ్య నూతనంగా ఏర్పాటు చేసిన శిరీష ఎంటర్‌ప్రైజెస్ పెట్రోల్ బంక్‌ను శుక్రవారం మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకుడు టి.ఏ. కుమార్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ శిరీష ఎంటర్‌ప్రైజెస్ రోజురోజుకూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.వినియోగదారులకు నాణ్యమైన ఇంధనం, మెరుగైన సేవలు అందిస్తూ సంస్థ మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

