- కుటుంబ వ్యవస్థకు.. ఆరోగ్యకర సమాజానికి మానవ సంబంధాలే కీలకం
- సీఎం.ఆర్.ఎఫ్, ఎన్టీఆర్ వైద్యసేవలతో కూటమిప్రభుత్వంలో ప్రజలకు ఉత్తమ వైద్యసేవలు.
- నాదెండ్లలో ప్రత్తిపాటి ఫౌండేషన్, ప్రత్తిపాటి శరత్, శంకర నేత్రాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీమంత్రి.
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 29:
చిలకలూరిపేట : కుటుంబ వ్యవస్థలో స్వార్థం, పెద్దల పట్ల అగౌరవం, అనుచిత ప్రవర్తన పెరగడం అత్యంత బాధాకరమని, అవయవలోపాలు.. అనారోగ్య సమస్యలతో బాధపడే కుటుంబసభ్యులను పట్టించుకోకపోవడం మంచిపద్ధతి కాదని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారిని చిన్నచూపు చూడటం కుటుంబ బంధాలకు, ఆరోగ్యకర సమాజానికి ఎంతమాత్రం మంచిదికాదని, ఆదరణ…ఆప్యాయత ఆయన హితవు పలికారు.
ఆదివారం ఆయన టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాదెండ్ల మండల కేంద్రంలోని శ్రీ పార్వతీ, పరమేశ్వర కల్యాణ మండపంలో ప్రత్తిపాటి ఫౌండేషన్, ప్రత్తిపాటి శరత్ ఆధ్వర్యంలో శంకర నేత్ర వైద్యశాల సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఉచిత మెగా కంటి వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యసేవలకోసం తరలివచ్చిన వారి యోగక్షేమాలను ప్రత్తిపాటి విచారించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటుచేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు.
సీఎం.ఆర్.ఎఫ్, ఎన్టీఆర్ వైద్యసేవలతో ప్రజలకు ఉత్తమమైన ఉచిత వైద్యసేవలు
శరీరంలోని అవయవాల్లో కళ్లే ప్రధానమైనవని, కంటి చూపు లేకుంటే ఎన్ని ఉన్నా ఉపయోగం ఉండదని, కళ్ల ప్రాధాన్యతను గుర్తించి ప్రజలు వాటిని సంరక్షించు కోవాలని ప్రత్తిపాటి సూచించారు. శంకర నేత్ర వైద్యాలయం సహా, పలు ప్రధాన ఆసుపత్రులన్నీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రజారోగ్యరక్షణ పాటుపడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం.ఆర్.ఎఫ్), ఎన్టీఆర్ వైద్యసేవ విభాగాల పరిధిలో ఉత్తమమైన ఉచిత వైద్యసేవలు అందిస్తున్నాయని ప్రత్తిపాటి తెలిపారు. మే లేదా జూన్ నెలల్లో నియోజకవర్గ ప్రజల కోసం తిరుపతి బర్డ్ ఆసుపత్రి సహకారంతో మోకాలి శస్త్ర చికిత్సలకు సంబంధించి ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రత్తిపాటి తెలిపారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ నల్లమోతు హరిబాబు, గుంటూరు హాస్పిటల్ సూపరిడెంట్ యశస్వి రమణ, శంకర్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసరావు, ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వాహకులు కంచర్ల శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బత్తినేని శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, గ్రామ నాయకులు నల్లమోతు విజయ సారధి, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, ప్రసాద్, పూర్ణ, శరత్, నిర్వాహకులు ఆర్టీసీ వరప్రసాద్, నాయకులు, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు

