- వెనుకబడిన వర్గాలకు ఆర్థిక, సామాజిక చేయూత అందించాలన్నదే పీ-4 పథకం ప్రధానోద్దేశం.
- బంగారు కుటుంబాలకు అండగా నిలిచిన మార్గదర్శుల్ని సన్మానించిన ప్రత్తిపాటి.
- పీ-4 పథకం తొలి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాటి.
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 30 :
చిలకలూరిపేట : ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన పేద, మధ్య తరగతి వర్గాలను గుర్తించి, వారికి చేయూత నివ్వాలన్నదే పీ-4 లక్ష్యమని, పేదరికం లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే చంద్రబాబు ప్రధాన ఆలోచన అని, దానిలో పీ-4 తొలి అడుగని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాట పుల్లారావు తెలిపారు.
కూటమి ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఆలోచన అయిన పీ-4 పథకం ప్రారంభించి ఏడాది పూర్తి అయిన సందర్భాన్ని (తొలి వార్షికోత్సవం) పురస్కరించుకొని స్థానిక మున్సిపల్ టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడారు. పీ4 పథకం కింద ఎంపికైన బంగారు కుటుంబ లబ్ధిదారులు, మార్గదర్శులతో ప్రత్యేకంగా ప్రత్తిపాటి మాట్లాడారు. అనంతరం మార్గదర్శులకు ప్రభుత్వ ప్రశంసా పత్రాలు అందించి, వారిని సన్మానించారు.
పారిశ్రామికవేత్తలు, ధనవంతులు మోదీ, చంద్రబాబు లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలి
పేదల జీవితాల్లో వెలుగులు, సంతోషాలు నింపాలనే ఆలోచనపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు, ధనవంతులు ప్రధాని మోదీ లక్ష్యమైన వికసిత్ భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ 2047లో భాగస్వాములు కావాలని ప్రత్తిపాటి పిలుపునిచ్చారు. ప్రకృతి విపత్తులు, అనుకోని విపత్కర పరిస్థితుల్లో పేదలకు అండగా నిలిచే పలు సంస్థలు, వ్యక్తులు చిలకలూరిపేటలో ఉండటం నిజంగా నియోజకవర్గానికే గర్వకారణమని ప్రత్తిపాటి చెప్పారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, సన్మాన గ్రహీతలు నియోజకవర్గ ప్రత్యేక అధికారి కే.మాధవి, సిబిఐపీయు మహమ్మద్ అలీ, నాగండ్ల రాంబాబు, జాష్టి కృష్ణమోహన్, దుమాల జ్యోతి, తోట శ్రీరాములు, మల్లవరపు బాలకిషోర్ రాజు, వజ్జ సింగయ్య, షేక్ ఖాజా హుస్సేన్, షేక్ సుభాని, జానీ భాష, ఎంపీడీవోలు, టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

