Homeతెలంగాణనిర్మల హైస్కూల్ లో రక్షాబంధన్ వేడుకలు

నిర్మల హైస్కూల్ లో రక్షాబంధన్ వేడుకలు

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 28 :

రాఖీ పండుగ సోదరీ సోదరుల ప్రేమానురాగాలకు ప్రతీకఅని నిర్మల హై స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ జిన్సీ అన్నారు గార్ల మండల కేంద్రంలోని స్థానిక నిర్మల హైస్కూల్‌లో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకొని పరస్పర రక్షణ సోదర భావాన్ని చాటుకున్నారు. అనంతరం ఈసందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ జిన్సీ మాట్లాడుతూ రక్షాబంధన్ కేవలం అన్నా చెల్లెళ్ల బంధానికి పరిమితం కాకుండా సమాజంలో పరస్పర ప్రేమ సామరస్యం రక్షణ భావాలను పెంపొందించే పండుగ అని అన్నారు. విద్యార్థి దశ నుంచే భారతీయ సంస్కృతి నైతిక విలువలను అలవర్చు కోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ ఆన్సులిన్ కొచ్చు తెరిసా , సిస్టర్ సెలైన్ జార్జ్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు , సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular