గూడెంకొత్తవీధి,పెన్ పవర్ ఆగస్టు 27:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి సీతారామరాజు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. గూడెంకొత్తవీధి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేసుకుంటోందని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. మండల, గ్రామస్థాయిలోని సీనియర్ నాయకులు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజలను కలవాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంతోపాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నియమించిన అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గూడెంకొత్తవీధి మండలంలోని ప్రతి పంచాయతీలో పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో సీలేరు, వంచుల, దేవరపల్లి పంచాయతీలకు చెందిన జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వంతల అరుణ్‌కుమార్, గుంట కొమ్ములు, రీమల కోటేశ్వరరావు, కొర్ర రాంబాబు, కొర్ర చిట్టిబాబు, వంతల సోమనాథ్, దారకాని మోహన్, పాంగి లక్ష్మణ్, గురుమూర్తి తదితరులకు ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.కార్యక్రమంలో ఎంపీపీ బోయిన కుమారి జీకేవీధి మండల అధ్యక్షుడు కంకిపాటి గిరిప్రసాద్, ఉపాధ్యక్షులు వంతల అరుణ్‌కుమార్, రీమల బాలకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శులు వంతల చంటిబాబు, కొర్ర బలరాం, పిల్ల బుజ్జి, పాంగి చందర్రావు, మువ్వల చిన్నబ్బాయి, వంతల రాజారావు, దేవరాజు ఉదయ్‌భాస్కర్, సోషల్ మీడియా అధ్యక్షుడు పాతను లక్ష్మణరావు, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు కొర్ర రాంబాబు, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు కంకిపాటి రామారావు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు వనపల రాజేష్, యువత అధ్యక్షుడు లంబసింగి రమేష్, జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు వసుపరి తిమోతి, జిల్లా కోశాధికారి కుందేరి రామకృష్ణ, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీలు కొర్ర రాజులమ్మ, మొట్టడం సత్యనారాయణ, పోతురాజు కృష్ణమూర్తి, అడపా లోవకుమారి, మాజీ సర్పంచులు, మాజీ జడ్పీటీసీ మచ్చేల మాత్యరాజు, మాజీ మండల అధ్యక్షులు, వివిధ పంచాయతీల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి:ఎమ్మెల్యే మత్స్య రస విశ్వేశ్వరరాజు
RELATED ARTICLES

