ePaper
Monday, March 30, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్రామకృష్ణ మిషన్ సేవలు అభినందనీయం

రామకృష్ణ మిషన్ సేవలు అభినందనీయం

📰 Generate e-Paper Clip

 

200 మందికి చీరల పంపిణీ
రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి

గంగవరం రంపచోడవరం, పెన్ పవర్ మార్చి 30:
రామకృష్ణ మిషన్ మిషన్ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అందజేస్తున్న సేవలు అభినందనీయమని రంపచోడవరం శాసనసభ్యురాలు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ మిరియాల శిరీష దేవి అన్నారు.రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో సోమవారం సిరిగిందలపాడు గ్రామంలోని రామకృష్ణ మిషన్ వైద్యశాలలో దివ్య జనని శ్రీ శారదాదేవి శుభాగమన దినోత్సవం (ఏప్రిల్ 2) పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సిరిగిందలపాడు, ఇర్లపల్లి, పందిరిమామిడి, గోగుమిల్లి, బందపల్లి, రాజపూడి, రంపచోడవరం, గోకవరం, గంగవరం మండలాలకు చెందిన సుమారు 200 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగ మహిళలకు సుమారు రూ.2 లక్షల విలువైన చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ మాట్లాడుతూ, శారదా మాత జగన్మాత కాళికామాత అవతారమని, ఆపదలో ఉన్న వారికి తల్లిలా ఆశ్రయం కల్పించడమే మిషన్ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన అందరికీ అన్నదానం నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం రాజమండ్రి బ్రహ్మచారులు జానకీశ చైతన్య, ఇష్టచైతన్య, డాక్టర్ టి.వి. సుబ్బారావు, భక్తులు పి. బాబూరావు, శ్రీనివాస్, వాలంటీర్లు సాయి ఫణికుమార్, వి. నాగేశ్వరరావు (విశ్రాంత ఉపాధ్యాయులు), భగీరథ రాజు, వినయ్, కోట్ల మంగిరెడ్డి, వైద్య సేవల సమన్వయకర్త కానుమోను శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular