అధికారుల ఆదేశాలు బేఖాతరు
– కాజులూరులో అనధికార మట్టి తవ్వకాలు జోరు
ప్రజల ఆందోళన – తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్
కాజులూరు, పెన్ పవర్,మార్చి 30:
కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతున్న తీరు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ, రాత్రి పగలు తేడా లేకుండా అనధికారంగా మట్టి తవ్వకాలు, రవాణా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల ప్రకారం, కాజులూరు గ్రామంలో గత వారం రోజులుగా గ్రామ రహదారులను ధ్వంసం చేస్తూ అనధికార లేఔట్లకు మట్టి తరలిస్తున్నారు. తహసీల్దార్, విఆర్వోలకు నామమాత్రపు సమాచారం ఇచ్చి లక్షలాది రూపాయల అక్రమ వ్యాపారం సాగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ముఖ్యంగా మండల కేంద్రమైన కాజులూరులో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో, స్కూల్లకు వెళ్లే విద్యార్థులకు మట్టి ట్రాక్టర్లు ప్రమాదకరంగా మారాయి. అతివేగంతో ట్రాక్టర్లు నడపడం వల్ల విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్, ఎంపీడీవో కార్యాలయం ఎదుటుగా ట్రాక్టర్లు నిరంతరం రాకపోకలు సాగించడం ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది.గ్రామ ప్రధాన రహదారులపై మట్టి రవాణా కారణంగా ధూళి కాలుష్యం పెరిగి, స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో కూడా మట్టి తవ్వకాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రమాదాల భయం నెలకొంది. ఎటువంటి అనుమతులు లేకుండా ఈ కార్యకలాపాలు జరుగుతున్నాయని, ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిది అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
మట్టి మాఫియా సభ్యులు తమను అధికార పార్టీకి చెందినవారమని చెప్పుకుంటూ, ప్రశ్నించే వారిపై, మీడియాపై కూడా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు.ఇప్పటికైనా రెవెన్యూ, పంచాయతీ అధికారులు స్పందించి అనధికార మట్టి తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, మట్టి మాఫియాపై కళ్లెం వేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ట్రాక్టర్ డ్రైవర్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి కేసులు నమోదు చేసి నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.