వైద్యో నారాయణో హరిః.. నాటి మాట!
వ్యాపారమే పరమావధి.. నేటి బాట!
వైద్య పట్టాతో శస్త్రచికిత్సలా? చట్టం ఏం చెబుతోంది?
విశాఖ, పెన్ పవర్, ఏప్రిల్ 05 :
- వైద్యం అంటే ప్రాణం పోసేది.. కానీ నేడు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల తీరు చూస్తుంటే అది వ్యాపారంగా మారిందనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరియు చిన్న పట్టణాల్లో కేవలం ప్రాథమిక వైద్య పట్టా ఎం. బి బి ఎస్ ఉన్న వైద్యులు కూడా శస్త్రచికిత్స నిపుణు లు’గా అవతారమెత్తి పేద రోగులకు ఆపరేషన్లు చేసేస్తున్నారు. ఇది కేవలం అనైతికమే కాదు, అక్షరాలా చట్టవిరుద్ధం.
అర్హత ఎంత? ఆపరేషన్లు ఎందరికి?
జాతీయ వైద్య కమిషన్ నిబంధనల ప్రకారం, ప్రాథమిక వైద్య పట్టా అనేది కేవలం సాధారణ చికిత్సలకు మాత్రమే పరిమితం. వీరు కేవలం. సాధారణ వైద్యులుగా రోగాలను గుర్తించి మం దులు ఇవ్వడానికి, చిన్నపాటి గాయాలకు కుట్లు వేయడానికి మాత్రమే అర్హులు.
నిజమైన శస్త్రచికిత్స నిపుణుడు ఎవరు?
ఒక వైద్యుడు ఆపరేషన్ చేయాలంటే ప్రాథమిక పట్టా తర్వాత శస్త్రచికిత్సలో స్నాతకోత్తర పట్టా ఎం. ఎస్- మాస్టర్ ఆఫ్ సర్జరీ లేదా దానికి సమా నమైన జాతీయ బోర్డు డిగ్రీని పూర్తి చేయాలి. గుండె, మెదడు వంటి క్లిష్టమైన అవయవాలకు ఆపరేషన్ చేయాలంటే అత్యున్నత స్థాయి ప్రత్యేక నిపుణత ఎం సి హెచ్ కలిగి ఉండాలి.
మాయమాటలతో దోపిడీ”తక్కువ ధరకే ఆపరేషన్” అనే మాయమాటల తో ప్రైవేట్ ఆసుపత్రులు పేద రోగులను ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేక నిపుణులకు ఇచ్చే రుసుము ను మిగి ల్చుకోవడానికి ఆసుపత్రి యాజమాన్యాలు అక్కడే పని చేసే సాధారణ వైద్యులతో శస్త్ర చికిత్సలు చేయిస్తున్నాయి.
నిపుణుల హెచ్చరిక: తగిన అర్హత లేని వైద్యు డు శస్త్రచికిత్స చేస్తే,మత్తు మందు లోపాలు లేదా కోతల్లో జరిగే పొరపాట్ల వల్ల రోగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం 90 శాతం ఎక్కువగా ఉంటుంది.
రోగులు గమనించాల్సిన అంశాలు:
నామఫలకాన్ని గమనించండి: డాక్టర్ పేరు పక్కన కేవలం ఎం.బి.బి.ఎస్ అని ఉంటే వారు పెద్ద తరహా ఆపరేషన్లు చేయడానికి అనర్హులు.
పట్టాను సరిచూసుకోండి: శస్త్రచికిత్స నిపుణు డు ఎం.ఎస్, ప్రసూతి మరియు స్త్రీ రోగ నిపుణు లు ఎం.ఎస్ – గైనకాలజీ వంటి అర్హతలు ఉన్నా యో లేదో అడగండి.
నమోదు సంఖ్య: వైద్య మండలి గుర్తింపు పొంది న నిపుణుడు అవునా కాదా అనేది అంతర్జాలం లో వారి నమోదు సంఖ్య హక్కు.ద్వారా తనిఖీ చేయవచ్చు.
ప్రభుత్వ నిఘా ఏది?
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రైవేట్ ఆసుపత్రుల పై నిరంతరం నిఘా ఉంచాలి. అర్హత లేని డాక్టర్లతో ఆపరేషన్లు చేయిస్తున్న ఆసుపత్రుల అనుమతులను రద్దు చేయాలి. పేదవాడి రక్తాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్న “నకిలీ” వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
పేదరికం శాపం కాకూడదు. తక్కువ ధరకు వైద్యం దొరుకుతుందని ప్రాణాలను పణం గా పెట్టకండి. శస్త్రచికిత్సకు ముందు వైద్యుడి అర్హతను అడగడం మీ హక్కు.

