ePaper
Monday, April 6, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడనీటి భద్రత, సంరక్షణ అందరి బాధ్యత

నీటి భద్రత, సంరక్షణ అందరి బాధ్యత

సాగునీటి సంరక్షణకు 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ప్రారంభం

రామచంద్రపురం/కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 6:

మానవాళి మనుగడకు నీరు అత్యవసరమని, నీటి భద్రత మరియు సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.సాగునీటి సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను సోమవారం వెల్ల గ్రామంలో ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా కోరింగ కాలువ, వెల్ల లాకులు, గుర్రపు డెక్క తొలగింపు పనులను మంత్రి పరిశీలించారు.చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ,భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నాలుగు దశల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. వెల్ల పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ,నీటి వనరుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని చెప్పారు. చెరువులు, కాలువలు, వాగులను శుభ్రపరిచే కార్యక్రమాల్లో రైతులు,నీటి సంఘాల ప్రతినిధులు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వినియోగించు కోవాలని సూచించారు.ఈ ప్రత్యేక కార్యక్రమం ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు కొనసాగుతుందని, దీని ద్వారా సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించి భూగర్భ జలాలు పెరుగుతాయని మంత్రి వివరించారు.


నియోజకవర్గంలో గుర్రపు డెక్క తొలగింపు, కాలువల పూడికల తొలగింపు, షెల్టర్ మరమ్మత్తుల కోసం రూ.4.70 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు ఈఈ రామకృష్ణ తెలిపారు. కూటమి పార్టీ సీనియర్ నాయకుడు వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ సాగునీటి కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.రామచంద్రపురం రూరల్ మండల టిడిపి అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఈఈ వివి రామకృష్ణ, ఎంపీడీవో జే.రాంబాబు,ఏఈ సుజాత, ఇతర అధికారులు, రైతులు, నీటి సంఘాల ప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular